1.అపరాధిని యేసయ్యాEm/080/052
అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)
1.సిలువకు నిను నే గొట్టితిని
తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (2)
2.ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో (2)
3.ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)
4.దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి (2)
ద్రోహుండనై జేసితినీ
దేహంబు గాయంబులను (2)
5.ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2)
6.చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2)
7.శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా (2)
2. భాసిల్లెను సిలువలో
భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను||
1.కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను||
2.దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం (2) ||భాసిల్లెను||
3.పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను||
4.నీ మరణపు వేదన వృధా గాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో (2) ||భాసిల్లెను||
5.ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను||
6.నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను (2) ||భాసిల్లెను||
3. ఎందుకో నన్నింతగా
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)
1.నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే
నా స్థానములో నీవే (2) ||ఎందుకో||
2.నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి
నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో||
3.నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు
నను దాచియున్నావు (2) ||ఎందుకో||
4.నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు
నన్ను విడువనంటివే (2) ||ఎందుకో||
5.నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||
4. సిలువలో ఆ సిలువలో027/098/Dm
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా ||సిలువలో||
1.నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ- మోయలేక మోసావు (2)
కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)
తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2) ||వెలి||
2.వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను (2)
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా (2) ||వెలి||
3.నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే
నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే (2)
నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం (2)
సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను (2) ||వెలి||
5. నన్ను బ్రతికించుటకు027/093/Gm
నన్ను బ్రతికించుటకు – నీవు మరణించితివే
నా పాపం కడుగుటకు – నీ రక్తం కార్చితివే
అయ్యా నీ త్యాగము వర్ణనాతీతము
చేయనీ ధ్యానము – జీవితాంతము (2)
యేసయ్యా.. యేసయ్యా..
యేసయ్యా.. యేసయ్యా… (2)
1.ఏ నేరము చేసావని
మోసావయ్యా పాప భారం
ఏ ఘోరం చేసావని
తీసారయ్యా నీదు ప్రాణం (2) ||యేసయ్యా||
2.ఏ అర్హత నాకుందని
కార్చావు నీ శుద్ధ రుధిరం
ఏ యోగ్యత నాకుందని
చేసావు ఆ సిలువ యాగం (2) ||యేసయ్యా||
6. సిల్వలో నాకై కార్చెను027/093/Gm
సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము (2)
శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
అమూల్యమైన రక్తము – యేసు రక్తము (2)
1.సమకూర్చు నన్ను తండ్రితో – యేసు రక్తము (2)
సంధి చేసి చేర్చును – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
ఐక్యపరచును తండ్రితో – యేసు రక్తము (2)
2.సమాధాన పరచును – యేసు రక్తము (2)
సమస్యలన్ని తీర్చును – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
సంపూర్ణ శాంతినిచ్చును – యేసు రక్తము (2)
3.నీతిమంతులుగ చేయును – యేసు రక్తము (2)
దుర్నీతి నంత బాపును – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
నిబంధన నిలుపును రక్తము – యేసు రక్తము (2)
4.రోగములను బాపును – యేసు రక్తము (2)
దురాత్మల పారద్రోలును – యేసు రక్తము (2)
యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)
శక్తి బలము నిచ్చును – యేసు రక్తము (2)
7. నా కోసమా ఈ సిలువ యాగము
నా కోసమా ఈ సిలువ యాగము
నా కోసమా ఈ ప్రాణ త్యాగము |2|
కల్వరిలో శ్రమలు నా కోసమా
కల్వరిలో సిలువ నా కోసమా|2| || నా కోసమా ||
1.నా చేతులు చేసిన పాపానికై
నా పాదాలు నడచిన వంకర త్రోవలకై |2|
నీ చేతులలో… నీ పాదాలలో…
నీ చేతులలో నీ పాదాలలో
మేకులు గుచ్చినారే |2|
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు|2| || నా కోసమా ||
2.నా మనస్సులో చెడు తలంపులకై
నా హృదిలో చేసిన అవిధేయతకై |2|
నీ శిరస్సుపై… నీ శరీరముపై…
నీ శిరస్సుపై నీ శరీరముపై
ముళ్ళను గుచ్చినారే |2|
యేసయ్యా నాకై సహించావు
యేసయ్యా నాకై భరించావు|2| || నా కోసమా ||
8. ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన వినెడి పావనుడా
ప్రార్థన మాకు నేర్పుమయా
శ్రమలు యేసువా చుట్టుకొని –
శత్రుమూక నిను బట్టగను (2X)
శాంతముతో – శరణనివేడిన –
గెత్సెమనె ప్రార్థన నేర్పుమయా
శత్రుమూక నిను చుట్టుకొని
సిలువపైన నిను జంపగను
శాంతముతో నీ శత్రుల బ్రోవగ
సలిపిన ప్రార్థన నేర్పుమయా
9. చూడుము ఈ క్షణమే
పల్లవి: చూడుము ఈ క్షణమే కల్వరిని
ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను
గొప్ప రక్షణనివ్వ శ్రీ యేసుడు
సిలువలో వ్రేలాడు చున్నాడుగా
1. మానవు లెంతో చెడిపోయిరి
మరణించెదమని తలపోయక
ఎరుగరు మరణము నిక్కమని
నరకమున్నదని వారెరుగరు
2. ఇహమందు నీకు కలవన్నియు
చనిపోవు సమయాన వెంటరావు
చనిపోయినను నీవు లేచెదవు
తీర్పున్నదని ఎరుగు ఒక దినమున
3. మనలను ధనవంతులుగా చేయను
దరిద్రుడాయెను మన ప్రభువు
రక్తము కార్చెను పాపులకై
అంగీకరించుము శ్రీ యేసుని
4. సిలువపై చూడుము ఆ ప్రియుని
ఆ ప్రేమకై నీవు యేమిత్తువు
అర్పించుకో నీదు జీవితము
ఆయన కొరకై జీవించుము
10. సిలువ భారము
సిలువ భారము భరించలేని భారమైన మోసితివ ప్రభు
పలుమార్లు ఒరిగి లేచి గిరికి సాగితివ ప్రభు
1. దుర్భాషలెల్ల పలుకుచుండ మౌనివైతివా కొరడాలు నీదు
దేహమంతా చీల్చివేయగా – ప్రవహించె నీదు మధుర ప్రేమ రుధిరధారలై
।।సిలువ।
2.సిలువేయు మనుచు రాత్రి జాములో కేకలేసిరా – అన్యాయమైన
తీర్పు తీర్చి సిలువకేసిరా – కఠినాత్ములైన వారికేకలే కడకు గెల్చెనా
।। సిలువ।।
3.కనుపండుగాయె కఠినులకు నీ బాధ చూడగా
స్ధంభించిపోయె దూత గణము తొంగిచూడగా
పరలోక తండ్రికి ఇదంత మోదమాయెనా
।।సిలువ।।
4.మా పాప భారమంతా నీపై మోపబడిన దా మా శాపఋణము మేము ఇలలో
ఎటుల తీర్చెదము ప్రభు గైకొనుము మమ్ము ప్రభు
।। సిలువ।। 128/124 D#m
11. హేతువేమి లేదు 51/103/Gm
హేతువేమి లేదు నన్ను ప్రేమించుటకు
పేదనైన నాలో ఏమి కంటివి దేవా ।2।
1)నాదు పాపము – దోషమే కదా
సిలువ మోసినట్టి – కారణం
నీదు పావన రక్తముచే కంటివి నన్ను
।।హేతువేమి।
2)నాదు రోగము శాపమే కదా
సిలువ మోసినట్టి – కారణం
నీదు గాయములతో నన్ను బాగుచేసితివే ।2।
12. సందేహమేల సంశయమదేల S-001, t-100,Cm
సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2) ||సందేహమేల||
1.ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే
నీ పాప శిక్షను తానే – భరియించెనే (2)
ప్రవహించె రక్త ధార నీ కోసమే
కడు ఘోర హింసనొందె నీ కోసమే (2) ||సందేహమేల||
2.ఎందాక యేసుని నీవు – ఎరగనందువు
ఎందాక హృదయము బయట – నిలవమందువు (2)
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2) ||సందేహమేల||
3.ఈ లోక భోగములను – వీడజాలవా
సాతాను బంధకమందు – సంతసింతువా (2)
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2) ||సందేహమేల||
4.లోకాన ఎవ్వరు నీకై – మరణించరు
నీ శిక్షలను భరియింప – సహియించరు (2)
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2) ||సందేహమేల||
13.ఎత్తుకే ఎదిగినా
ఎత్తుకే ఎదిగినా – నామమే పొందినా (2)
నాకు మాత్రము నీవే చాలయ్యా
నీ జాడలో నే నడుస్తానయ్యా
నీ కౌగిలిలో నే ఉంటా
రా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ..
రా.. నా ప్రియ యేసు రా – (2)
1ఆశీర్వాదములు కావయ్యా
అభిషేకము కొరకు కాదయ్యా (2)
నీవే నా ఆశీర్వదమయ్యా
నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2)
నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా
నీ జాడలో నే నడుస్తానయ్యా
నీ కౌగిలిలో నే ఉంటా… ఓ..
రా.. నా ప్రియ యేసు రా… హో… ఓ..
రా.. నా ప్రియ యేసు రా – (2)
నీకై నేను – నాకై నీవు
ఉంటే చాలయ్యా – అదియే నా ఆశ దేవా ..
నాలో ఉన్నవాడా – నాతో ఉన్నవాడా
నీవుంటే చాలయ్యా – రావా నాకై
నా ప్రాణం నీవయ్యా – నా ప్రేమ నీకేయ్యా
నీవే నా ఊపిరి యేసయ్యా
నీ పాదాలపై అత్తరునై నేనుంటా
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా
2.పరలోకము కొరకు కాదయ్యా
వరముల కొరకు కాదయ్యా
ప్రవచనముల కొరకు కాదయ్యా
నీవుంటే నాకు చాలయ్యా
నీ శ్వాసే పరలోకం దేవా
నిను పోలిన వరములు ఏవి లేవయ్యా
ఎన్నెన్ని వరములు నాకున్నా
నీవు లేని జీవితమే వ్యర్ధముగా
నీ కోసమే బ్రతికెదను యేసయ్యా
నీ కోసమే చావైనా మేలేగా
నీ..కై ఎవరు రాకున్నా హో…
నీ సువార్తను ప్రకటిస్తా హో… ఓ..
నీ హతసాక్షిగ నే చస్తా
రా.. నా ప్రియా యేసు రా…
నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లే
నా కన్నీటిని చూసి నీ కన్నీరే నను చేరే
కన్నీరు కలిసినట్టు కలవాలనుంది యేసు
నీకై నే వేచి ఉన్నా రావా నాకై…
నా గుండె చప్పుడే పిలిచె నిను రమ్మని
నీవే నా ఊపిరి యేసయ్యా
నీ గుండె లోతున ఆలోచన నేనేగా
నా ప్రాణ ప్రియుడా యేసయ్యా.. హో…
నాకు మాత్రము నీవే చాలయ్యా – (4)
వీడని ప్రియుడవు రావా నాకై
నిన్ను పోలి ఉంటా నే రావా నాకై
వేచియున్నా నీ కోసం రావా నాకై
ప్రేమిస్తున్నా నిన్నే నే రావా నాకై
రావా… దేవా… రావా… దేవా…
నాకు మాత్రము నీవే చాలయ్యా
నా కోసము రావా యేసయ్యా… త్వరగా…
14.భాసిల్లెను సిలువలో
భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను||
1.కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను||
2.దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం (2) ||భాసిల్లెను||
2.పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను||
3.నీ మరణపు వేదన వృధా గాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో (2) ||భాసిల్లెను||
4.ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను||
5.నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను (2) ||భాసిల్లెను||
15.సిలువ చెంత చేరిననాడు
సిలువ చెంత చేరిననాడు
కలుషములను కడిగివేయున్
పౌలువలెను సీలవలెను
సిద్ధపడిన భక్తులజూచి
కొండలాంటి బండలాంటి
మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన
పిలచుచుండే పరము చేర ||సిలువ||
వంద గొర్రెల మందలోనుండి
ఒకటి తప్పి ఒంటరియాయే
తొంబది తొమ్మిది గొర్రెల విడిచి
ఒంటరియైన గొర్రెను వెదకెన్ ||సిలువ||
తప్పిపోయిన కుమారుండు
తండ్రిని విడచి తరలిపోయే
తప్పు తెలిసి తిరిగిరాగా
తండ్రియతని జేర్చుకొనియే ||సిలువ||
పాపి రావా పాపము విడచి
పరిశుద్ధుల విందుల జేర
పాపుల గతిని పరికించితివా
పాతాళంబే వారి యంతము ||సిలువ||